రజినీ కోసం నన్ను అవమానించారు..
గత ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న వైసీపీకి షాక్ మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజు మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో తన కులమే తనకు శాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి తాను వెళ్లిపోవడానికి ప్రధాన కారణం జగనేనని ఆరోపించారు. వైసీపీలో తనకు సరైన గుర్తింపు లేదని.. చాలా చులకన భావంతో చూశారని ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని.. 2023 చివర్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఓడిపోయిన విడదల రజినీని చిలకలూరి పేట ఇన్చార్జిగా చేశారని, ఆమె కోసం తనను అవమానాలకు గురిచేశారని ఆరోపించారు. త్వరలోనే సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లుగా మర్రి ప్రకటించారు.


 
							 
							