వారు తప్పకుండా బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందే
ఏపీలో పల్నాడు జిల్లాలోని గ్రామ వార్డు, సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. వారు ఖచ్చితంగా రోజుకు 3 సార్లు బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనన్నారు. ఉదయం 10.30 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అటెండెన్స్ చూపించాలని కోరింది. ఈ బయోమెట్రిక్ విధానం ఎప్పటినుండో ఉన్నప్పటికీ వారు సరిగ్గా అమలు చేయడం లేదని అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇకమీదట తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ఈ హాజరు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించింది.
