Andhra PradeshHome Page Slider

ఏపీలో వారికి రేపటి నుంచే సెలవులు

ఏపీలో 10 వ తరగతి పరీక్షలు ముగిశాయి. ప్రధాన పరీక్షలు ఈ నెల 15వ తేదినే పూర్తయ్యాయి. కాగా వొకెషనల్ సహ ఇతర సబ్జెక్టుల పరీక్షలు నేటితో ముగిశాయి. దీంతో వారికి రేపటి నుంచి మళ్లీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యి ఇంటర్ కాలేజీల్లో చేరేంత వరకు సెలవులుంటాయి.  ఏపీలో మొత్తం 6.64 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు  పరీక్షలు రాసినట్లు SSC బోర్డ్ అధికారులు వెల్లడించారు. కాగా వీరు రాసిన సమాధాన పత్రాల వాల్యూషన్ రేపటి నుంచి ఈ నెల 26వ తేది వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వాల్యూషన్‌లో 35 వేలమంది ఉపాధ్యాయులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలను మే రెండో వారంలో వెల్లడించాలని అధికారులు నిర్ణయించారు.