Andhra PradeshHome Page Slider

పండుగకు తెగ తాగేశారు..

సంక్రాంతి మూడు రోజుల పండుగకు ఏపీలో మందుబాబులు రికార్డ్ బ్రేక్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి. పండగ జరిగిన మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సెజ్ వర్గాలు పేర్కొన్నాయి. భోగి పండగ రోజు రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరగగ్గా, సంక్రాంతి, కనుమ రోజుల్లో రోజుకు రూ.150 కోట్ల చొప్పున మద్యం విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు. సాధారణంగా ఏపీ లో నిత్యం రూ.80 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయి. పండగ మూడు రోజుల్లో అదనంగా రూ.160 కోట్ల మద్యం అమ్ముడైనట్లు తెలుస్తోంది. భోగి రోజున మద్యం లైసెన్స్ దారులు 210 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు చేశారు. తర్వాత రోజు రూ. 220 కోట్ల మద్యం తీసుకున్నారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు చూస్తే 7 లక్షల కేసుల మద్యం.. 2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గతంలో ఎప్పుడూ సంక్రాంతి పండగకు ఈ స్థాయి అమ్మకాలు నమోదు కాలేదని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.