Home Page SliderInternational

‘యుద్ధాలకు డబ్బిస్తారు గానీ, తిండికి లేదంటే ఇవ్వరా’ పాక్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు

పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారయ్యిందని, నగదు నిల్వలు అయిపోయాయని పాక్ ప్రదాని షెవాబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ప్యారిస్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ఫ్యాక్ట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ధనిక దేశాలు యుద్ధాలు చేసుకోవడానికి డబ్బులిస్తారని, కానీ ఆకలితో, సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ వంటి దేశాలకు ఇవ్వడానికి చేతులు రావని ఆక్రోశించారు. లక్షల మంది ప్రాణాలను కాపాడడానికి ఆర్థిక సహాయం చేయమని అభ్యర్థించారు. గత ఏడాది వరదలతో, తాజాగా బిపోర్ జోయ్ తుపాన్‌తో నష్టపోయామని, జూన్ చివరి నాటికి ఐఎమ్ ఎఫ్ నుండి పాక్‌కు రావలసిన 6.5 బిలియన్ డాలర్ల రుణం ముగుస్తుంది. గత నవంబర్ నుండి పెండింగ్‌లో ఉన్న 1.1 బిలయన్ డాలర్ల రుణాన్ని విడుదల చేయాలంటూ ఐఎమ్ ఎఫ్ ‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి గ్లోబల్ ఫైనాన్సింగ్  ఫ్యాక్ట్‌ సహాయం చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో రుణాన్ని ఆశించి పాక్ ప్రధాని ఈ సదస్సుకు హాజరయ్యారు.