Home Page SliderTelangana

రీల్స్ కోసం ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లారు..

ఆ తరం.. ఈ తరం కాకుండా ప్రతి ఒక్కరు రీల్స్ చేయడంలో మునిగి తేలుతున్నారు. కొందరు యువకులు హద్దులు దాటి మరి రీల్స్ చేస్తున్నారు. తాజాగా కొందరు యువకులు ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లి రౌండ్స్ కొట్టి రీల్స్ చేస్తున్నారు. ఈ వీడియో కాస్తా వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులకు సీఐ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంటలో జరిగింది. పోలీస్ వాహనంలో రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎస్సై బంధువులు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.