Home Page SliderInternationalSports

మహిళల టీ 20 వరల్డ్ ఛాంపియన్స్ వీరే..

మహిళల టీ 20 వరల్డ్ ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్ నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించింది. గత 15 ఏళ్లుగా న్యూజిలాండ్ వరల్డ్ కప్ కోసం ప్రయత్నిస్తోంది. ఇది వారికి మొదటి వరల్డ్ కప్ కావడం విశేషం. ఐసీసీ వరల్డ్ కప్ పురుషుల, మహిళల క్రికెట్‌కు ప్రైజ్‌మనీని సమానంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనితో ఈసారి ఛాంపియన్స్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు 2.34 మిలియన్ డాలర్లు (రూ.19.67 కోట్లు) బహుమతిగా లభిస్తోంది. అదే విధంగా గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచినందుకు అదనంగా రూ.78 లక్షలు కూడా వచ్చింది. అంటే మొత్తం రూ.20.45 కోట్లు దక్కింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు 1.17 మిలియన్ డాలర్లు (రూ.9.83 కోట్లు) . లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచినందుకు సౌతాఫ్రికాకు రూ.78 లక్షలు వచ్చింది. దీనితో మొత్తంగా రూ. 10.62 కోట్లు అందుకున్నారు.