అబద్దాలకు రెక్కలు కట్టి అభాండాలు వేస్తున్నారు
చంద్రబాబుని బొంకుల బాబు అని ఎందుకనకూడదని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లి లో ఆయన కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలకు రెక్కలు కట్టి తమ పార్టీ పై అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018-19లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.3లక్షల కోట్ల మేర అప్పులున్నాయని, తమ ప్రభుత్వం 2024లో దిగిపోయేనాటికి రూ.4.50లక్షల కోట్లు మాత్రమే అప్పలున్నాయని , ఎవరి హయాంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా అంటూ జగన్ విన్నవించారు.చంద్రబాబు హయాంలో జరిగిన ఆర్ధిక విధ్వంసం మరే గవర్నమెంట్ లోనూ జరగలేదన్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం.పరిధి దాటి తమ ప్రభుత్వం కేవలం రూ. 1600 కోట్లు మాత్రమే అప్ప చేసిందన్నారు. కానీ ఒకసారి 12 లక్షల కోట్లు,ఇంకోసారి 14లక్షల కోట్లు అంటూ అబద్దాలకు రెక్కలు కట్టి అంతా దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. కరోనా మహమ్మారి పీడించినా ప్రజలకు మంచే చేశామన్నారు.కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతున్నా ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదన్నారు.