అవి కరోనా కేసులు కావు : కిమ్
ప్రపంచం మొత్తాన్ని కరోనా కబళిస్తున్న తరుణమది. ఆ సమయంలో మా దేశంలో అసలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పిన ఒకే ఒక్క దేశం ఉత్తర కొరియా. అటువంటి దేశం కూడా ఈ మధ్య కాలంలో కరోనా బారిన పడింది. అయితే కరోనాపై మేము పూర్తిగా విజయం సాధించామని తాజాగా ప్రకటించింది. అలా ప్రకటించి రెండు వారాలు కూడా కాకముందే..మళ్ళీ ఆ దేశ సరిహద్దుల్లో జ్వరం కేసులు వెలుగు చూశాయి.

దీంతో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉండే ఉత్తర కొరియాలో కరోనా మరల విజృభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు ఉత్తర కొరియా దీనిపై స్పందించింది. కొత్తగా నమోదైయినవి కరోనా కేసులు కాదని,ఇన్‌ఫ్లూయెంజాకి సంబంధించిన కేసులని స్పష్టం చేసింది. దీని బారిన పడ్డవారిలో జ్వరం సాధారణంగా ఉందని వారంతా కోలుకున్నారని చెప్పింది. ఈ కేసులు కొవిడ్‌కి సంబంధించినవి కావు. కాబట్టే అక్కడ లాక్‌డౌన్ ఎత్తివేశామని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది.

