Home Page SliderNationalPolitics

బడ్జెట్‌లో వారికి అధిక ప్రాధాన్యం.. ప్రధాని మోదీ

రేపు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌పై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దానిలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంటూ కీలక హింట్ ఇచ్చారు. పేదలు, మధ్యతరగతి వారికోసం, మహిళల కోసం మహాలక్ష్మిదేవి కటాక్షం చూపించాలని వ్యాఖ్యానించారు. దీనితో ఈ సారి బడ్జెట్‌లో కొన్ని మహిళలకు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తారనే అంచనాలు పెరిగాయి. మధ్యతరగతి వారు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆదాయపు పన్ను శ్లాబుల సవరణ, స్టాండర్డ్ డిడక్షన్ వంటివి ఉంటాయని ఆశపడుతున్నారు. అలాగే మహిళల కోసం, నైపుణ్య శిక్షణలు, ముద్రయోజన వంటి పథకాలు, జన్‌ధన్, మహిళా సమ్మాన్ సేవింగ్ వంటి కొత్త పథకాలు వస్తాయని ఎదురుచూస్తున్నారు. పేదల కోసం పీఎంఏవై, జాతీయ ఉపాధి హామీ పథకాలకు కేటాయింపులు పెంచుతారని ఆశిస్తున్నారు.