‘నాకంటే వారే పెద్ద హీరోలన్న’ పవన్ సంచలన వ్యాఖ్యలు
మహేశ్ బాబు, ప్రభాస్ తనకంటే పెద్ద హీరోలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. వారాహి విజయయాత్రలో కోనసీమ జిల్లాలోని ముమ్ముడివరంలో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తనకు హీరోలందరిపై అభిమానం ఉందని, ప్రభాస్, మహేష్ బాబులు తనకంటే పెద్ద హీరోలు, ఎక్కువ పారితోషకం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. తానేమీ పాన్ ఇండియా హీరోను కాదన్నారు. ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లు గ్లోబల్ హీరోలని, వారిని ప్రపంచమంతా గుర్తు పడుతుందని అన్నారు. తనకు హీరోలందరూ ఇష్టమేనని, ఎలాంటి ఇగో లేకుండా అందరితో బాగా మాట్లాడుతానని పేర్కొన్నారు. కులం పరంగా గొడవలు పడొద్దని, సినిమాలకు రాజకీయాలకు ముడి పెట్టొద్దని, అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలందరూ ప్రశ్నించాలని కోరారు. ప్రతీ హీరో అభిమానులు కలిసికట్టుగా జనసేనను గెలిపించాలని, వైసీపీ చేసే అన్యాయాలను ఎదిరించాలని, మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు.

