గుజరాత్ రాష్ట్రంలో వాటిపై నిషేధం..
గుజరాత్ రాష్ట్రంలో పాక్ బోర్డర్ ప్రదేశాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే భుజ్ వంటి ప్రదేశాలలో పాక్ నుండి ఎటాక్ జరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి వేడుకలకైనా బాణాసంచాలు, డ్రోన్లపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి ప్రకటించారు. ఈ నెల 15 వరకూ ఇది అమలులో ఉంటుందని వెల్లడించారు. పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిర్ణయానికి కొద్ది సేపటి ముందే గుజరాత్ ముఖ్యమంత్రితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే.

