రేపటి నుండి వాహనాలకు ఈ రూల్స్ అమలు
రేపటి నుండి వాహనాల విషయంలో కొత్త రూల్స్ అమలు కానున్నాయి. వాహనం కొన్న 90 రోజులలోపు రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్లు, ఫాస్టాగ్ నంబరుతో అప్‌లోడ్ చేయాలని, లేదంటే ఫాస్టాగ్ హిట్ లిస్టులో ఉంటుందని పేర్కొన్నారు. 30 రోజుల గడువులోపు చేయకపోతే బ్లాక్ లిస్టులో పెడతారు. 3 నుండి 5 సంవత్సరాలలోపు జారీ చేసిన ఫాస్టాగ్‌లన్నింటికీ కేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ కేవైసీ చేస్తున్న సమయంలో వాహనం ముందు, పక్కవైపు ఫోటోలను స్పష్టంగా అప్‌లోడ్ చేయాలి. దీనికోసం అక్టోబరు 31 వరకూ సదరు సంస్థలకు ఎన్‌పీసీఐ సమయాన్ని ఇచ్చింది.

