ఏప్రిల్ 1 నుండి బంగారం కొనాలన్నా, అమ్మాలన్నా ఈ రూల్స్ పాటించాల్సిందే
బంగారం కొనుగోలు,అమ్మకాలకు ఏప్రిల్ 1 నుండి కేంద్రప్రభుత్వం కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. బంగారు ఆభరణాలకు ఆరు నెంబర్ల హాల్‌మార్క్ గల యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఏ బంగారు దుకాణం దారులు ఈ నెంబరు లేని బంగారు ఆభరణాలను అమ్మడం చట్టరీత్యా నేరం. మార్చి 4నాడు మినిస్ట్రీ ఆఫ్ కన్జూమర్ అఫైర్స్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఈ నిబంధన అమలులోకి వచ్చింది.

నకిలీ బంగారు ఆభరణాల అమ్మకాలకు చెక్ పెట్టేందుకు, ప్రతీ షాప్‌లో ఒకే విధమైన నాణ్యత గల ఆభరణాల అమ్మకానికి ఈ నిబంధన ఉపయోగపడుతుంది. ఈ ఆరంకెల నెంబరు బంగారం స్వచ్ఛతను తెలియజేస్తుంది. ఇక పాత బంగారాన్ని అమ్మాలంటే బంగారం స్వచ్ఛతను చెక్ చేయించుకుని, దానిని ఖరీదు కట్టించి అమ్ముకోవాల్సి ఉంటుంది.

