Home Page SliderTelangana

వెనుకబడ్డ తెలంగాణ మంత్రులు వీరే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. తెలంగాణలో మంత్రులు కూడా వెనుకంజలో ఉంటున్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు కాంగ్రెస్ హవాను తట్టుకోలేక పోతున్నారు. ధర్మపురి నియోజక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్, నిర్మల్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి, బాల్కొండ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావులు కూడా వెనుకబడి పోవడంతో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 68 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతుంటే, బీఆర్‌ఎస్ పార్టీ 38 స్థానాలలో ఆధిక్యతలో ఉంది.