Home Page SliderTelangana

‘వాలంటైన్ డే’ పేరుతో ఇవేం వెర్రి పనులు!!

సమాజంలో జరిగే మంచి, చెడుపై స్పందించి ప్రజలకు అవగాహన కల్పించే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా అదిరిపోయే స్టంట్లు అంటూ.. అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను వదులుతున్నాయి. అతి వేగంతో ప్రమాదకరరీతిలో చేసే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేయడం డేంజర్. ఇలాంటి సాహసాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకొని.. మీ కుటుంబసభ్యులను మనోవేదనకు గురిచేయకండి. అంటూ ట్వీట్ చేశారు.