బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
ఏపీ, తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నానికి పీవీఎన్ మాధవ్, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కడప-కర్నూలు-అనంతపురం స్థానానికి నగరూరు రాఘవేంద్రను ఎంపిక చేసింది. తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యయ స్థానానికి వెంకట నారాయణ రెడ్డి పేరును బీజేపీ కన్ఫామ్ చేసింది. మరికొన్ని స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. టీచర్, గ్రాడ్యుయేట్, లోకల్ బాడీల్లో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ, 9 లోకల్ బాడీ స్థానాలు మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక తెలంగాణలో ఒక్కో ఉపాధ్యయ, లోకల్ బాడీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది.

