‘బెస్ట్ సిటీస్ ఫర్ ఉమన్’ ఇవే..
మహిళలకు భద్రత, నైపుణ్యాలు, ఉద్యోగావకాశాల విషయంలో దేశంలోనే బెస్ట్ సిటీస్ ఫర్ ఉమన్‌గా ఐదు నగరాలు నిలిచాయి. అవతార్ గ్రూప్ 2024 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 120 నగరాలలో సర్వే నిర్వహించారు. వీటిలో టాప్ 3 నగరాలు దక్షిణాదికి చెందినవే కావడం విశేషం. హైదరాబాద్‌కు 4వ స్థానం దక్కింది. మొదటి స్థానంలో బెంగళూరు నిలిచింది. బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, పుణె నగరాలు టాప్ 5 నగరాలుగా రికార్డు సాధించాయి. టెక్నాలజీ పరంగా మహిళలు అత్యధిక ఉద్యోగాలు హైదరాబాద్‌లో పొందారు. నైపుణ్యం, ఉపాధిలో 5వ స్థానం, భద్రతలో 2 వస్థానం సాధించింది హైదరాబాద్. మౌలిక సదుపాయాల కల్పనలో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ప్రయాణ సౌకర్యాలలో ఆదర్శ నగరంగా నిలిచింది. వీటిలో చెప్పుకోదగినవి మహిళల భద్రత కోసం షీ టీమ్స్, మెట్రో రైల్. అవతార్ గ్రూప్ వరల్డ్ బ్యాంక్, క్రైమ్ రికార్డ్స్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ అకానమీ వంటి ఇండెక్స్‌ల ద్వారా ఈ సర్వేను నిర్వహించారు.