మేలుకోకపోతే ముప్పు తప్పదు
కేవలం వచ్చే ఏడేళ్లలో మానవజాతి తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది ఐక్యరాజ్యసమితి. 2030 నాటికల్లా ఇప్పటికి ఉండే ప్రపంచంలోని మంచినీరు 40శాతం తగ్గిపోతుందని సర్వేలు చెపుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ లిమిట్ ఎప్పుడో దాటి పోయిందని, భూతాపం మరింత పెరిగి చాలా దుష్ప్రభావాలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాస్త్రవేత్తల అంచనాల కంటే వేగంగా గ్లోబల్ వార్మింగ్ ఎక్కువవుతోందని, నదులలో నీరు ఆవిరయిపోతోందని, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయని, గ్రీన్‌హౌస్ వాయువులు భూమిపై విరుచుకు పడబోతున్నాయని హెచ్చరించింది. ఓజోన్ పొర తొలగిపోతే భూమిపై ఆక్సిజన్ కూడా కరువయిపోతుంది.

ప్రపంచ దేశాలన్నీ కలిసి కట్టుగా నివారణ చర్యలు చేపట్టి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలనీ హితబోధ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కర్మాగారాలలో కర్బన ఉద్గారాల ఉత్పత్తిని యుద్ధ ప్రాతిపదికన తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించింది. లేదా అతిత్వరలో మానవులతో పాటు సమస్తప్రాణులు స్వచ్చమైన నీరు, గాలి లేక అల్లాడాల్సి వస్తుంది. సత్వర చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

