ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదు:వైసీపీ నేత
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిందని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేత,మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనేది శుద్ధ అబద్దం అని ఆయన కొట్టి పారేశారు. అయితే ఈసారి మూడు పార్టీలో పొత్తు పెట్టుకోవడం వల్లే ఇలాంటి ఫలితం వచ్చిందన్నారు. కాగా 2019 ఎన్నికల్లో రాపాక జనసేన తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు.అయితే ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.