Home Page SliderTelangana

తెలంగాణా కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన కుమ్ములాటలు.

తెలంగాణా కాంగ్రెస్‌లో వర్గపోరు ఊపందుకుంది. కుమ్ములాటలు రచ్చకెక్కాయి. తాజాగా ఆసిఫాబాద్ కాంగ్రెస్‌ మీటింగులలో మరోమారు కాంగ్రెస్‌లో వారిలో వారికే గొడవలు పెరిగాయి. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, గణేష్ రాథోడ్‌ల మధ్య గొడవ ఎక్కువయ్యింది. ఏకంగా ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావిద్ ముందే ఇరువర్గాలు తన్నుకున్నారు. మాటకు మాట బదులిచ్చుకోవడంతో పాటు కాగజ్ నగర్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ బూతులతో రెచ్చిపోయారు. ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని వార్నింగ్‌లు ఇచ్చుకున్నారు. విపరీతమైన ఆగ్రహంతో కార్యకర్తలు, నేతలు ఊగిపోయారు. దీనితో ఈ కార్యక్రమం రసాబాసగా మారింది.