“హసీనాపై కుట్ర జరిగింది”..ఒప్పుకున్న బంగ్లా ప్రధాని
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాపై కుట్ర జరిగిన మాట నిజమేనని అంగీకరించారు తాత్కాలిక ప్రధాని, నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్. ఆమెను ప్రధాని పదవి నుండి దిగేలా ముందస్తు వ్యూహం ప్రకారం జరిగిందేనని, కానీ దీనివెనుక ఎవరున్నారో తనకు తెలియదన్నారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా ఈ విషయం వెల్లడించారు. ఆ సమయంలో అక్కడ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో పాటు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ఉన్నారు. యూనస్ మాట్లాడుతూ విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్‌కు కొత్తరూపు తీసుకొచ్చారన్నారు. హసీనాను ప్రధాని పీఠం నుండి దిగేలా చేయడంలో మహపుజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చని వ్యాఖ్యానించారు. గతంలో హసీనాపై కుట్రలో విదేశీ హస్తం ఉందనే వదంతులు కూడా వినిపించాయి. బంగ్లాదేశ్‌కు చెందిన సెయింట్ మార్టిన్ దీవిలో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తే బంగ్లాదేశ్ ఎన్నికలు సాఫీగా జరిగేలా చేస్తానని అమెరికా ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం పలుసార్లు భారత్‌ను కోరింది. ఆమెపై పలు హత్యకేసులు నమోదు చేసింది.