అక్కడ పండక్కి ఆవు పేడతో కొట్టుకుంటారు..
పండక్కి ఆవు పేడతో ఒకరినొకరు కొట్టుకోవడం ఎక్కడైనా చూశారా? ఇది ఎక్క డో కాదు.. సంక్రాంతికి జల్లికట్టు పోటీలు జరుపుకునే తమిళనాడులోనే ఈ పేడ ఫెస్టివల్ జరిగింది. రోడ్ జిల్లాలోని తలవాడి అనే గ్రామంలో 300 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. దీపావళి పండుగ అయిన తర్వాత సరిగ్గా 4వ రోజున ఆవుపేడతో ఒకరినొకరు కొట్టుకుంటారు. అక్కడున్న బీరేశ్వర్ ఆలయం ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది. అనేక ఏళ్లుగా ఆలయానికి దగ్గరలో ఉన్న ఒక గొయ్యిలో ఈ సహజ ఎరువును ఉంచి, దాన్నే వ్యవసాయానికి వాడేవారట. అక్కడ శివలింగం దొరకగా.. దాన్ని ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు. అప్పటి నుంచి ఈ పేడ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. ఈ తంతు పూర్తయ్యాక అదే పేడను గ్రామస్తులకు పంచుతారు. దాన్ని వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగిస్తే పంటలు బాగా పండుతాయని ఆ వారి నమ్మకం.

