ఢిల్లీ ఎన్నికలలో హస్తంతో జట్టులేదు
ఢిల్లీ ఎన్నికల విషయంలో ఒంటరిగానే పోటీ చేస్తామని, హస్తం పార్టీతో పొత్తు లేదని ఆమ్ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలవడానికి కారణం అతి విశ్వాసమే అని పార్టీ నేత కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అహంకార బీజేపీ, అతి విశ్వాసం గల కాంగ్రెస్‌పై తాము రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలవగలమని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గత ఎన్నికలలో భాగస్వామ్య పక్షాలను పట్టించుకోలేదని ఆరోపించింది. ఢిల్లీలో పదేళ్లుగా ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవకపోయినా కాంగ్రెస్‌కు లోక్‌సభలో మూడు సీట్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ కలిసి రాకపోవడం వల్లే ఆప్ కూడా ఓటమి పాలయ్యిందని వారి వాదన.

