Home Page SliderTelangana

‘DSC విషయంలో తగ్గేదే లేదు’..రేవంత్ రెడ్డి

DSC పరీక్షల విషయంలో ఎవ్వరి ఒత్తిళ్లకు తగ్గేదే లేదంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పరీక్షల తేదీలను వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు రోడ్డెక్కారు. రాత్రి వరకూ నినాదాలు చేస్తుండడంతో వారిని సిటీ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్భందించి ఉంచారు పోలీసులు. ప్రభుత్వం ప్రిపరేషన్ కోసం సమయం ఇవ్వాలని, టీచర్ పోస్టులను 25వేలకు పెంచాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జూలై 18 నుండి ఆగస్టు 5 వరకూ జరుగుతాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ముందుగా ప్రకటించిన ప్రకారం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది.