Home Page SliderTelangana

“వారిని వదిలే ప్రసక్తే లేదు”..బండి సంజయ్

కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. తనను రెండుసార్లు జైలుకు పంపారని, దీనికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తనపై 109 కేసులు పెట్టి వేధింపులకు పాల్పడిందన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం కట్టుకథ అని, బీజేపీ నేతలు చెప్పడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందనేది పచ్చి అబద్దం అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తన మాతృసంస్థ కాంగ్రెస్‌లోనే చేరుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఆరోపణలు మానుకోవాలని హితవు చెప్పారు. పార్టీలు, ప్రభుత్వాల సూచనల మేరకు కోర్టులు తీర్పులు ఇవ్వవు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గ్రహించాలని మండిపడ్డారు.