ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు : మంత్రి అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నాయకులను నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మరల అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర వెలవెలబోయిందని ,ఇక చిరంజీవి సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నారని ఆయన రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు.
