“మామధ్య మూడోదేశం తలదూర్చవలసిన అవసరం లేదు”..భారత విదేశాంగ శాఖ మంత్రి
భారత్, చైనాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి మూడవదేశం సలహాలు, సంప్రదింపులు అవసరం లేదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. సంబంధాలు మెరుగ్గా అయితే లేవని, ఈ రెండు దేశాల సరిహద్దుల మధ్య సంబంధాలు సరిగ్గా లేవని ఆయన అంగీకరించారు. క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ టోక్యోలో విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించారు. ఈ దేశాల మధ్య సంబంధాలు ప్రపంచంలోని ఇతర దేశాలను కూడా ప్రభావితం చేయగలవు. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో భేటీలో కొన్ని విషయాలు ప్రస్తావించామని, వీటిలో సరిహద్దులో బలగాల ఉపసంహరణ కూడా ఉందన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

