Home Page SliderTelangana

కేరళలో ఇల్లులేని కుటుంబం లేదన్నారు: బృందా కారత్

బోనకల్లు: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. మధిర సీపీఎం అభ్యర్థి పాలడుగు భాస్కర్ విజయాన్ని కాంక్షిస్తూ బోనకల్లు మండలం రావినూతల, వైరా సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రానికి మద్దతుగా వైరా, కొణిజర్ల మండలంలో శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీ మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే రైతులు ఢిల్లీని దిగ్బంధించి విజయం చేకూర్చారు. తెలంగాణ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చిందా అని ప్రశ్నించగా మహిళలు ఇవ్వలేదని చెప్పడంతో, ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో ఇల్లులేని కుటుంబం లేదన్నారు.