Home Page SliderNews AlertTelangana

షుగర్‌ ప్యాక్టరీలకే దిక్కులేదు.. కానీ విశాఖ ఉక్కును కాపాడుతాడా…

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహించారు. తెలంగాణలో మూతపెట్టిన షుగర్‌ ఫ్యాక్టరీలకు దిక్కులేదు గానీ విశాఖ ఉక్కును కాపాడతారట అంటూ ఎద్దేవా చేశారు. మహోజ్వల భారత్‌ కాదు దొర.. ముందు మహోజ్వల తెలంగాణ అయిందా? అంటూ నిలదీశారు. మీది ఉజ్వల పాలన కాదు.. అవినీతి, అక్రమ, దౌర్జన్య, నిర్భంధ, అరెస్టు, గుండాల పాలన అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి, రాష్ట్రాన్ని కోలుకోలేని స్థితికి తీసుకువెళ్లి దేశాన్ని ఏలతాడట దొర అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారు అని దేశాన్ని ఉద్ధరిస్తారు అంటూ మండిపడ్డారు షర్మిల.