అక్కడ సోషల్ మీడియాపై నిషేధం
సోషల్ మీడియా చిన్న పిల్లలపై చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. దాని వినియోగం వల్ల 16 ఏళ్ల లోపు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతోంది. సోషల్ మీడియా ఖాతాలలో పరిచయమయ్యే క్రిమినల్స్, మోసగాళ్ల కారణంగా వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు త్వరలోనే కొత్త చట్టం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వయసు వెరిఫికేషన్ విధానం ద్వారా సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తామన్నారు. ఈ బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే యూఎస్‌లో 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లను చూడాలంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ఫ్రాన్స్‌లో కూడా ఇలాంటి నిషేధం ప్రతిపాదించినా వినియోగదారుల వ్యతిరేకత వల్ల అమలు కాలేదు. భారత్‌లో కూడా ఇలాంటి నిషేధం విధించాలని కోరుతున్నారు.