అక్కడ.. చేపలతో అల్లం పంట!
మన వంటకాలలో అల్లం వెల్లుల్లి పాత్ర చాలా కీలకమైనది. అల్లం వెల్లుల్లి పడితేనే అసలైన రుచీ వస్తోంది. అయితే.. అల్లం సాగు విషయంలో చైనా రైతులు వినూత్న పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ఘాటైన, కాస్త పెద్ద సైజులో అల్లం పండాలంటే మాత్రం చేపల్ని ఎరువుగా వేయాల్సిందేనట. ఈ పంట సాగుకు ఎరువుగా చనిపోయిన చేపల్నీ ఉపయోగిస్తున్నారు. భూమిలో అల్లం కొమ్ములతో పాటు చనిపోయిన చేపల్ని కూడా వేసి పూడుస్తున్నారు. ఈ బయో ఫెర్టిలైజర్ భూమిలో కుళ్లిపోతూనే ఎరువుగా మారి భూసారాన్నిస్తోందని, అల్లం ఘాటు కూడా బాగుంటోందని రైతులు చెబుతున్నారు. చనిపోయిన చేపల్ని పంట వేయడానికి ముందే కొని నిల్వ చేసుకుంటున్నామని వారు అంటున్నారు. దీంతో చైనాలో అల్లానికి సమానంగా చనిపోయిన చేపలకీ కూడా గిరాకీ ఉంటుందట.