Home Page SliderTelangana

తెలంగాణ లోక్ సభ 17 స్థానాల్లో మూడుపార్టీలున్నా… ద్విముఖ పోటీయేనా?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతుండగా, తెలంగాణ లోక్ సభ ఎన్నికలు మాత్రం ఈసారి పెద్ద ఊపు లేవన్నట్టుగా కన్పిస్తున్నాయ్. ఎన్నికల్లో పార్టీలు గెలవాలన్న కసిగా ఉన్నప్పటికీ, ఓటరు నైరాశ్యంగా ఉన్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అంతగా జోష్ కన్పించడం లేదు. అసెంబ్లీ, లోక్ సభ వేర్వేరుగా జరగడంతో.. నాటి దూకుడు ఇప్పుడు లేదు. లోక్ సభ ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేసినప్పటికీ ఆయా ప్రాంతాల్లో అసలు తాము చూడలేదని ఓటరు చెబుతున్నారు. 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగాల్సి ఉన్నప్పటికీ పోటీ పలు నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య అన్నట్టుగా ఉంది. మెజార్టీ సీట్లను దక్కించుకొని తన పాలనకు రిఫరిండమ్ అన్న భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉంటే, ఇప్పుడు మెజార్టీ సీట్లను గెలుచుకొని భవిష్యత్ తెలంగాణ సర్కారు తమ చేతిలోకి వచ్చేలా చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే, ఆ తర్వాత జరిగే రాజకీయ కుదుపులతో తమకు తిరిగి అధికారం దక్కుతుందేమోనన్న ఆశతో ఉన్నాయ్. మొత్తంగా రాష్ట్రంలో మూడు పార్టీల నడము హోరాహోరీ సాగితే.. విజేత ఎవరైనా అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండగా పలు చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మరికొన్నిచోట్ల బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పోటీ నెలకొందన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీకి పునర్వైభవం తేవాలని కేసీఆర్ తపిస్తుంటే, దక్షిణాదిలో లోటును తెలంగాణలో పోడ్చుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇక రేవంత్ రెడ్డి తన భవిష్యత్ పాలనకు లోక్ సభ ఫలితాలు మరింత ఫీజిబిలిటీ ఇస్తాయని దీమాతో ఉన్నారు.