ఒక్కటే రెండు పార్టీలు అంటే నేనెందుకు గజ్వేల్ బరిలో?: ఈటల
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలకే బీసీ బంధు ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణ. కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులు.. ఎవరూ సంతోషంగా లేరన్నారు. అసైన్డ్, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని.. రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఈటల ఈ విషయాలను చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే తానెందుకు గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ గవర్నమెంట్‌తో ప్రజలు విసుగుచెందారన్న ఈటల. తెలంగాణలో డెవలప్‌మెంట్ కేవలం బీజేపీ పార్టీకే సాధ్యమన్న ఈటల. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమదే అని చెప్పుకుంటున్నారు.