Home Page SliderTelangana

టీచర్లు లేరు.. మేం స్కూల్ కి రాం..

కొన్ని రోజుల నుంచి స్కూల్ కి ఉపాధ్యాయులు రావడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారంతండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ఒక టీచర్ పాఠాలు చెప్పకుండా తిని మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోండి.. అని చెబుతున్నారన్నారు విద్యార్థులు. ఉదయం 9:30 గంటలు దాటినా ఉపాధ్యాయులు రాకపోవడంతో పిల్లలే స్కూల్ కి తాళం తీసి ఊడ్చుకొని ప్రార్థన చేసి క్లాసులో కూర్చున్నారని గ్రామస్తులు తెలిపారు. టీచర్లు రావడం లేదు.. మేం స్కూల్ మానేస్తామని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయంపై ఎంఈవోను వివరణ కోరగా.. అక్కడ ఉన్న టీచర్ గాయత్రి మెటర్నిటీ లీవ్ లో ఉన్నారని, ఆమె స్థానంలో ఇన్చార్జిగా శ్రీశైలం అనే ఉపాధ్యాయుడిని నియమించారని చెప్పారు. ఆయన లీవ్ లో ఉన్నారేమోనిని సమాధానం ఇచ్చారు.