HealthHome Page SliderTrending Today

స్వీట్ కార్న్ తింటే బోలెడు బెనిఫిట్స్..

అధిక పోషకాలు కలిగిన ఆహారంలో స్వీట్ కార్న్ ఒకటి. స్వీట్ కార్న్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. స్వీట్ కార్న్ ను బాయిల్ చేసి, స్టీమ్ చేసి, గ్రిల్ చేసి చాలా మంది తింటుంటారు. 100 గ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు 342 కేలరీలు ఉంటాయి. వీటిలో పీచు పదార్థాలు ఉంటాయి. బీ3, బీ5, బీ6, బీ9 మొదలైన విటమిన్లు ఉంటాయి. స్వీట్ కార్న్ లో ఫైటూ కెమికిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని అనీమియాను తగ్గిస్తుంది. ఇది గర్భిణీలకు చాలా ఉపయోగకరమైనది. వీటిలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కూరలు, మిగతా కూరగాయలతో కలిపి వీటిని వండితే అన్ని పోషకాలు యధాతథంగా ఉంటాయి. కానీ నూనెలో డీప్ ఫ్రై చేస్తే మాత్రం పోషకాలు తగ్గుతాయి.

స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్, క్సాన్ థిన్స్, లూటైన్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సంక్లిష్టమైన కార్పొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా ముఖంపై ముడతలు రాకుండా చేస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అన్ని వయసుల వారు తినవచ్చు. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఇది సహాయపడుతుంది. స్వీట్ కార్న్ తింటే మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలను నుంచి ఉపశమనం లభిస్తుంది. అనేక లాభాలను కలిగిస్తున్న స్వీట్ కార్న్ తినడం అలవాటు చేసుకోవాలి.