Andhra PradeshBreaking NewsHome Page Slider

క‌నుల‌విందుగా కోనేటి రాయుడి తెప్పోత్స‌వం

తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో శ్రీవారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా మొదల‌య్యాయి.ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీవారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనుండగా శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తెప్పోత్సవాల కారణంగా ఈ నెల 13 వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను అధికారులు రద్దు చేసిట్లు ప్ర‌క‌టించారు.గ‌తంలో వైకుఠ ఏకాద‌శి టికెట్ల కోసం జ‌రిగిన‌ తొక్కిస‌లాట నేప‌థ్యంలో అధికారులు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తున్నారు.