అప్పుడు అందాల ఆరబోత…ఇప్పుడు ఆధ్యాత్మిక ధారబోత
మహాకుంభమేళాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ప్రయాగ్‌రాజ్ వద్ద పవిత్ర నదీస్నానమాచరించారు.2008లో మోడల్‌గా ప్రవేశించి,ఆ వెంటనే సినీ రంగంలోకి తెరంగేట్రం చేసిన సోనాల్ చౌహాన్ ….తెలుగులో లెజండ్,డిక్టేటర్,రూలర్,పండగ చేస్కో,సైజ్ జీరో వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.ఆమె నటించిన లెజండ్ మూవీ తప్ప అన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.కానీ క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపుసంపాదించుకున్నారు.ఒకప్పుడు అందాల ఆరబోతతో వెండితెరను సైతం ఉక్కిరి బిక్కిరి చేసి కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేసిన ఇలాంటి హీరోయిన్లంతా …ఇప్పుడు ఆధ్యాత్మిక ధారబోతతో స్పూర్తివంతంగా నిలుస్తున్నారు. వృత్తి,ప్రవృత్తి రెండూ వేర్వేరని సందేశమిస్తున్నారు. ఇటీవల మమతా కులకర్ణి సైతం మహామండలేశ్వర్‌గా మారిపోయారు.కుంభమేళా పుణ్యమాని….ఒకప్పుడు కురచ దుస్తులతో ఏహ్యతాభావానికి గురిచేసిన వారంతా ఫామ్ కోల్పోయాక అయినా సరే కాషాయవస్త్రధారణతో కనువిప్పు కలిగించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

