PoliticsTelangana

తీన్మార్ మల్లన్న సస్పెన్షన్..

కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. తీన్మార్ మల్లన్న ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కులగణనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్ ఆరోపించింది. ఫిబ్రవరి 5 పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించగా, ఆయన నుండి ఎలాంటి వివరణా రాలేదు. దీనితో పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.