Home Page SliderNational

ప్రముఖ సినీ నిర్మాత కారులో చోరీ

టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. ఆయన కారు లోపల ఉంచిన రూ.50 వేల నగదు,11 ఖరీదైన మద్యం సీసాలను దొంగలు ఎత్తుకెళ్లారు. కాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ సురేష్‌ అలియాస్ సురేంద్ర చౌదరికి సాయిగణేష్ ప్రొడక్షన్స్  పేరుతో  కార్యాలయం ఉంది. అయితే ఆ కార్యాలయం వద్ద గురువారం బెల్లంకొండ సురేష్‌కు చెందిన బెంజ్ కారును నిలిపి ఉంచారు. ఈ సమయంలోనే ఓ ఆగంతకుడు కారులో ఉన్న డబ్బు,మద్యం సీసాలను చోరీ చేశాడు. దీంతో బెల్లంకొండ సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.