Home Page SliderTelangana

లేడీస్ హాస్టళ్లలో చోరీ

హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది. ఏకంగా దొంగ లేడీస్ హాస్టళ్లలో ల్యాప్‌‌ట్యాప్‌ల చోరీకి పాల్పడ్డాడు. మహబూబాబాద్‌కు చెందిన సింధు (29), ఏపీలోని మంగళగిరికి చెందిన మనస్వి (24) నగరంలో ఉద్యోగం చేసుకుంటూ స్థానికంగా వేర్వేరు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు. అర్ధరాత్రి దాటాక దొంగ వేర్వేరు సమయాల్లో చోరీకి పాల్పడి ల్యాప్‌‌ట్యాప్ ల‌ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.