మద్యం మత్తులో యువతి హంగమా..
మద్యం మత్తులో యువతీ యువకులు హల్ చల్ చేశారు. ఒకే బైక్‌పై ఇద్దరు యువకులు కూర్చోగా వారి మధ్యలో యువతి ఊగిసలాడుతూ రచ్చ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వారికి ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ ఆ ముగ్గురు ఎంజాయ్ చేస్తూ చెలరేగిపోయారు. వెకిలి చేష్టలు చేస్తూ జనాల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. ఈ వీడియోను షేర్ చేస్తూ వీరిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.