పంత్ ను కాపాడిన యువకుడు సూసైడ్
భారత క్రికెటర్ రిషబ్ పంత్ ను రోడ్డు ప్రమాదంలో కాపాడిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదానికి పంత్ గురవ్వగా అక్కడే ఉన్న ఇద్దరు యువకులు అతడిని ఆస్పత్రికి తరలించి కాపాడిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరు యువకుల్లో ఒకరైన 25 ఏళ్ల రజత్ కుమార్ ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు. తన ప్రియురాలు మను కశ్యప్ తో కలిసి విషం తాగాడు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా బుచ్చా బస్తీలో ఈ నెల 9న ఈ ఘటన జరిగింది. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రజత్, మను కశ్యప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు విషం తాగారు. చికిత్స పొందుతూ మను కశ్యప్ మృతి చెందగా, రజత్ పరిస్థితి విషమంగా ఉంది.

