ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ ఇక లేరు..
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించిన కనబారో లుకాస్ కన్నుమూశారు. 116 సంవత్సరాల వయసు ఉన్న బ్రెజిల్ సన్యాసిని అయిన ఆమె నిన్న మృతి చెందారు. 1908 జూన్ 8న బ్రెజిల్ లోని రియో గ్రాండే డో సుల్ లో ఆమె జన్మించారు. 117వ జన్మదినానికి కేవలం ఒక నెల ముందు మరణించారు. లుకాస్ తన జీవితంలో ఎక్కువ భాగం సన్యాసినిగా గడిపారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బ్రెజిల్ లోని కాసెరోస్ లో శాంటా కాసా డి మిసెరికార్డియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. తన 21వ ఏళ్ల వయస్సులో నన్ గా ప్రకటించుకున్నారు. ఆమెకు ఫుట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. తన ప్రతి పుట్టిన రోజు సందర్భంగా ఫుట్ బాల్ టీషర్టు ధరించి బర్త్ డే వేడుకలు చేసుకునేవారు.