ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీ..25 ఏళ్లపాటు ప్రతీనెలా ‘ఐదున్నర లక్షలు’ కొట్టిన అదృష్టవంతుడు
ఎవ్వరూ ఊహించని అదృష్టం అతనిని వరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీగా దీనిని పేర్కొనవచ్చు. ప్రతీనెలా ఐదున్నర లక్షల సొమ్ము ఏకంగా 25 ఏళ్లపాటు పొందే అదృష్టం పొందాడు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మొహ్మద్ అదిల్ ఖాన్. లాటరీ ఎవరికైనా ఒకసారే తగులుతుంది. పెద్ద కార్పొరేట్ కంపెనీ సీఈవోకు జీతం వచ్చినంత డబ్బు ప్రతీ నెలా రావడమంటే మామూలు లాటరీ కాదు. అతడు నక్కతోక తొక్కాడనే చెప్పాలి. దుబాయ్‌లోని రియల్ ఎస్టేట్ సంస్థలో ఇంటీరియల్ డిజైన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న అతనికి ‘యూఏఈ ఫాస్ట్ 5’ పేరిట మెగా లాటరీ తగిలింది. దీనిలో అతడు మొదటి బహుమతి గెలుచుకున్నాడు. ఈ ప్రైజ్ ప్రకారం నెలకు 25 వేల దిర్హమ్‌లు ( 5, 59,822 రూపాయలు ) చొప్పున 25 ఏళ్లపాటు వస్తుంది. దీనితో అతడి ఆనందానికి అవధులు లేవు. తన కుటుంబానికి తనే ఆధారమని, కొవిడ్ సమయంలో చనిపోయిన సోదరుడి కుటుంబాన్ని కూడా తానే పోషిస్తున్నానని తెలిపాడు. అతడికి వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, ఒక ఐదేళ్ల పాప ఉన్నారు. ఈ అదనపు రాబడి ఎంతో కీలకంగా మారిందని తెలిపారు. ఈ ఎమిరైట్స్ లాటరీ సంస్థ హెడ్ మాట్లాడుతూ ఫాస్ట్ 5 లక్కీడ్రాను ప్రారంభించి 8 వారలలో మొదటి విజేతను ప్రకటించామని, తక్కువ కాలంలోనే మల్టీ మిలియనీర్‌గా మారడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. విజేత ప్రయోజనాల మేరకు ఒకేసారి కాకుండా ఇలా నెలనెలా ఇచ్చే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.