తాజ్ మహల్ వద్ద మహిళ హంగామా.. అడ్డుకున్న పోలీసులు
ప్రఖ్యాత చారిత్రాత్మక కట్టడం, ప్రపంచ వింత అయిన తాజ్ మహల్ వద్ద ఒక మహిళ కావడితో వచ్చి హంగామా చేసింది. దీనితో పోలీసులు ఆమెను తాజ్ మహల్ లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆమె తనకు భోలేనాథుడు కలలో కనిపించి తాజ్ మహల్ వద్ద కావడి సమర్పించాలని చెప్పాడని, అది తాజ్ మహల్ కాదు. మహదేవుని మందిరమైన తేజో మహల్ అని చెప్పాడని పేర్కొంది. తాను హిందూ మహాసభ మహిళా మోర్చా ఆగ్రా జిల్లా అధ్యక్షురాలినని, తన పేరు మీనా రాథోడ్ అని మీడియాతో పేర్కొంది. భుజాలపై కావడితో తాజ్ మహల్ పశ్చిమద్వారం నుండి లోనికి వెళ్లాలని ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ తెస్తే అనుమతిస్తామని చెప్పడంతో నిరాశగా వెనుతిరిగింది.