ట్రక్ డ్రైవర్ నిద్రమత్తుతో ఊరంతా చికెన్ పండగ..
తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు బర్డ్ ఫ్లూ భయాలు వణికిస్తున్న వేళ.. యూపీలో ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఒక ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఒక్కసారిగా బోల్తా పడింది. దాంతో చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకొని ట్రక్కునంతా ఖాళీ చేశారు.. దొరికిన వారికి దొరికన్నీ కోళ్లను పట్టుకుని ఊరంతా పండగ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.