పాకిస్థాన్ మొత్తాన్ని ఖతం చేయాలి..
పాకిస్థాన్ మొత్తాన్ని ఖతం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇండియా పవర్ ఏంటో పాకిస్థాన్ కు చూపించారన్నారు. పహల్గామ్ లో హిందువులనే లక్ష్యంగా చేసుకొని చంపారని పేర్కొన్నారు. ఉగ్రవాదులు మోడీకి చెప్పు అన్నారు, మోడీకి చెప్తే రిజల్ట్ ఇలా ఉంటుందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. టెర్రరిజం ఫ్యాక్టరీ పాకిస్థాన్ ను మొత్తం ఖతం చేయాలని మోడీకి కోరుతున్నానని రాజాసింగ్ అభ్యర్థించారు. ఇది రాజకీయం చేసే సమయం కాదు, అందరం మన దేశానికి అండగా నిలవాల్సిన సమయం అని అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.