పెళ్లి షూట్ కాస్త బర్న్ వెడ్డింగ్ లా మారింది..
కర్ణాటక బెంగుళూరులోని ఓ పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వెడ్డింగ్ షూట్ లో నూతన వధువు తీవ్ర గాయాలతో బయటపటింది. వివరాల్లోకి వెళితే.. వెడ్డింగ్ షూట్‌లో కలర్ బాంబును పేల్చి, ఆ కలర్స్ గాల్లో వ్యాపిస్తుండగా, పెళ్లి కూతురుని గాల్లోకి ఎగరేసి వీడియో తీయించుకోవాలనేది వరుడు ప్లాన్. అయితే కలర్ బాంబ్ పేలి యువతి హెయిర్స్‌కు ఫైర్ అంటుకుంది. అంతేకాకుండా యువతి శరీర భాగాల్లో కూడా తీవ్ర గాయాలవడంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె సేఫ్ గా ఉంది.