భారీగా పడిపోయిన రూపాయి విలువ
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. ఒక్క భారత్ లోనే కాదు…. సబ్ సహారా ఆఫ్రికన్ దేశాల నుంచి మధ్య ఆసియా చివరి దేశాల వరకు ఉన్న అభివృద్ది చెందుతున్న అన్నీ దేశాల పరిస్థితి ఇలానే కొనసాగుతుంది.దీనికి ప్రధాన కారణం.. అక్రమ చొరబాట్లపై ట్రంప్ ప్రభుత్వం తీసుకోబోయే చర్యల ప్రకటనలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకం విలువ 84.41కి పతనానికి చేరింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రూ.60.95లు ఉన్న డాలర్ తో రూపాయి విలువ నేడు 84.41 ల భారీ కనిష్టానికి పడిపోయింది. దీంతో విదేశాల నుంచి ఇండియాకి డబ్బు పంపించాలనుకునే ఎన్నారైల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరో వైపు స్టార్ మార్కెట్లు గరిష్ట పతనానికి చేరుకుంటున్నాయి. మొత్తం మీద ట్రంప్ దెబ్బ ఇండియాపై ఇటీవల కాలంలో గట్టిగానే పడినట్లు కనిపిస్తుంది.